![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -657 లో..... మీ వల్ల కాకపోతే చెప్పు మేమ్ చూసుకుంటామంటూ రుద్రాణి అప్పు, కావ్యలతో రుద్రాణి అంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ రుద్రాణిని సుభాష్ కోప్పడతాడు.ఆ తర్వాత కావ్య రాజ్ కి భోజనం తీసుకొని వెళ్తుంది. అసలేం జరిగిందని కావ్య అడుగుతుంది. హత్య జరిగిన కోణంలో ఆలోచిద్దాం.. మీరు రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీస్ బయట ఎవరైనా ఉన్నారా అని కావ్య అడుగుతుంది. అక్కడ బయట ఒక తాగుబోతు మందుకి డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు.. అతని పేరు లిక్కర్ కమలేష్ అని రాజ్ చెప్తాడు.
ఆ తర్వాత రాజ్ భోజనం తినేస్తాడు. కావ్య ఇంటికి వచ్చాక అప్పు దగ్గరికి వెళ్తుంది. కేసు విషయంలో ఇంకొక క్లూ దొరికిందని రాజ్ చెప్పిన విషయం అప్పుకీ చెప్తుంది. దాంతో ఇద్దరు కలిసి ఆధారాలు సంపాదించాలనుకుంటారు. మరుసటి రోజు ఇంట్లో అందరు రాజ్ గురించి బాధపడుతుంటారు. అపర్ణని సుభాష్ తీసుకొని కోర్ట్ కి వెళ్తాడు. వాళ్ళతో పాటు కళ్యాణ్ కూడా వెళ్తాడు. నిజం గానే అప్పు కావ్యలు ఆధారాలు తీసుకొని వస్తారా అని రాహుల్ అంటాడు. అలా ఏం జరగదు రాజ్ కి శిక్ష పడడం ఖాయమని రుద్రాణి అనగానే.. ఆస్తి మన చేతికి రావడం ఖాయమని రాహుల్ అంటాడు. మరొకవైపు అప్పు, కావ్యలు ఒక వైన్స్ దగ్గర కి వస్తారు. అక్కడ లిక్కర్ కమలేష్ గురించి అడుగుతారు. వాడెప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు.. వాడికి మందు తాగాలనిపించినప్పుడు వస్తాడని ఒకతను కావ్య, అప్పు లతో అంటాడు.
మరొకవైపు కోర్ట్ లో రాజ్ నోటి మాటల ద్వారా.. నేనేం తప్పు చెయ్యలేదని చెప్తాడు. అంత అనామిక చేసిందని రాజ్ అంటాడు. రాజ్ తమ్ముడు ఒకప్పటి మాజీ భార్య అనామిక..వాళ్లపై కోపంతో ఇలా చేస్తుందని రాజ్ తరుపున లాయర్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ హత్య చేసాడు.. శిక్ష వెయ్యాలని జడ్జ్ తీర్పు ఇచ్చే టైమ్ కొ కావ్య, అప్పులు లిక్కర్ కమలేష్ ని తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |